AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్త నిండిన ఎవరెస్ట్.. ప్రక్షాళనే బెస్ట్

ఎవరెస్టు పర్వత ప్రక్షాళనకు నేపాల్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను వెలికితీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో సుమారు 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ప్లాస్టిక్ క్యాన్లు, మానవ వ్యర్థాలు, ఆక్సిజన్ బాటిళ్లు, టెంట్లు, తాళ్లు, విరిగిపోయిన నిచ్చెనలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశారు. ఎవరెస్టు శిఖరంపై పర్వతారోహకుల మరణాలకు ట్రాఫిక్ జామ్ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. పర్వతా అధిరోహణపై కొన్ని […]

చెత్త నిండిన ఎవరెస్ట్.. ప్రక్షాళనే బెస్ట్
Anil kumar poka
|

Updated on: Jun 06, 2019 | 5:25 PM

Share

ఎవరెస్టు పర్వత ప్రక్షాళనకు నేపాల్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను వెలికితీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో సుమారు 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ప్లాస్టిక్ క్యాన్లు, మానవ వ్యర్థాలు, ఆక్సిజన్ బాటిళ్లు, టెంట్లు, తాళ్లు, విరిగిపోయిన నిచ్చెనలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశారు. ఎవరెస్టు శిఖరంపై పర్వతారోహకుల మరణాలకు ట్రాఫిక్ జామ్ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. పర్వతా అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ యోచిస్తోంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది.ఇందులో భాగంగా నాలుగు మృతదేహాలను ఎవరెస్టు ప్రక్షాళన బృందం అధికారులు వెలికితీశారు. అయితే అందులో ఇద్దరు వ్యక్తులు రష్యా, నేపాల్‌కు చెందినవారని గుర్తించారు.

ప్రక్షాళన ప్రక్రియలో వివిధ క్యాంపుల్లో సుమారు 5వేల కేజీల చెత్త బయటపడింది. బేస్ క్యాంపుల కంటే దిగువ భాగాన ఉండే ప్రాంతాల్లో 6వేల కేజీల వ్యర్థాలను తొలగించారు. అయితే సౌత్ కోల్ వద్ద పేరుకుపోయిన చెత్తన తొలగించడానికి అక్కడి వాతావరణం సహకరించడం లేదని ఆ దేశ పర్యాటక శాక జనరల్ డైరెక్టర్ దండు రాజ్ ఘిమిరే తెలిపారు. ఒక వైపు టిబెట్‌ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుంది. నేపాల్‌ ప్రభుత్వం మాత్రం అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది.

వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
భార్యను ఓనర్ తిట్టాడని.. ఇతనేం చేశాడో తెలుసా..?
భార్యను ఓనర్ తిట్టాడని.. ఇతనేం చేశాడో తెలుసా..?
మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో..
మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో..
హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా?
హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..