AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాను కబళిస్తున్న కరోనా.. 32 వేలకు పైగా కేసులతో హైరానా

చైనాలోని వూహాన్ లో తలెత్తిన భయంకర కరోనా.. అడ్డూ, అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ వ్యాధి బారిన పడి  మరణించినవారి సంఖ్య సుమారు 725 కు పెరగగా.. 32 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2002-2003 లో సార్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి లక్షణాలే కరోనాకు కారణమన్న వాదనను చైనా […]

చైనాను కబళిస్తున్న కరోనా.. 32 వేలకు పైగా కేసులతో హైరానా
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 08, 2020 | 7:34 PM

Share

చైనాలోని వూహాన్ లో తలెత్తిన భయంకర కరోనా.. అడ్డూ, అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ వ్యాధి బారిన పడి  మరణించినవారి సంఖ్య సుమారు 725 కు పెరగగా.. 32 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2002-2003 లో సార్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి లక్షణాలే కరోనాకు కారణమన్న వాదనను చైనా తోసిపుచ్చింది. వూహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్ నుంచి ప్రారంభమైన కరోనాకు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నా.. ఈ రాకాసి వ్యాధి మాత్రం అనేకమందిని బలి తీసుకుంటోంది. యుఎస్, నేపాల్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, తైవాన్, మలేసియా , వియత్నాం తదితర దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో.. కేరళలో మూడు కేసులను నిర్ధారించారు. అయితే ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి నివారణ చర్యలను యుధ్ధ ప్రాతిపదికన చేబట్టిన దృష్ట్యా.. ఎలాంటి ఆందోళనా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

కాగా-చైనాలోని ఆసుపత్రుల్లో కరోనా ఇన్ఫెక్షన్ సోకి హాస్పిటల్స్  సిబ్బంది కూడా అస్వస్థులవుతున్నారు. ఈ వ్యాధికారణంగా ఓ డాక్టర్ మరణించాడు. కరోనా సోకిన పేషంట్లకు ఇస్తున్న ఆహారాన్ని కూడా డాక్టర్లు మార్చేశారు. వారికి ఇప్పటివరకు చేపలతో తయారైన డైట్ ఇస్తుండగా.. దీని బదులు తాబేళ్ల మాంసంతో చేసిన డిష్ లను ఇస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి.

Follow Us
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..