AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే రోజు అధినేతల రాక.. సింహపురిలో సూపర్ టెన్షన్

అధినేతలిద్దరు ఒకే జిల్లాకు అదీ కూడా ఒకే రోజు వెళుతుండడంతో సింహపురిలో చర్చనీయాంశమైంది. అవును.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింహపురి పర్యటనకు వెళుతున్నారు. అది కూడా ఈ నెల 15వ తేదీన. అధినేతలిద్దరు ఒకే రోజు జిల్లాకు రానుండడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రతిపక్ష నేత ఒకేసారి వస్తుండటంతో పోటా-పోటీ స్వాగత ఏర్పాట్లు మొదలయ్యాయి. బల ప్రదర్శనకు […]

ఒకే రోజు అధినేతల రాక.. సింహపురిలో సూపర్ టెన్షన్
Rajesh Sharma
|

Updated on: Oct 12, 2019 | 4:36 PM

Share
అధినేతలిద్దరు ఒకే జిల్లాకు అదీ కూడా ఒకే రోజు వెళుతుండడంతో సింహపురిలో చర్చనీయాంశమైంది. అవును.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింహపురి పర్యటనకు వెళుతున్నారు. అది కూడా ఈ నెల 15వ తేదీన.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇటు చంద్రబాబు కూడా సమీక్షలో కోసం నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు. రెండు రోజుల పాటూ అక్కడే మకాం పెట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు.
ఇటు ముఖ్యమంత్రి రైతు భరోసా సభ, అటు చంద్రబాబు పర్యటనతో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ జిల్లాకు వస్తుండటంతో.. సీఎం సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే అమరావతిలో సమావేశమై సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఇటు టీడీపీ నేతలు కూడా చంద్రబాబు పర్యటన కోసం భారీ ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు.

ఇదిలా ఉంటే జగన్, చంద్రబాబు పర్యటనలు పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇద్దరి పర్యటనతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల పర్యటనలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఇద్దరు నేతల పర్యటనలతో నెల్లూరు జిల్లా వేడెక్కింది.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..