బ్రేకింగ్: సీఏఏ… ‘ అభ్యంతరాలున్నాయ్ ‘ నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన !

వివాదాస్పదమైన సీఏఏపై మొట్టమొదటిసారిగా బీజేపీ మిత్రపక్షమైన జేడీ-యు అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ చట్టంపై తమ రాష్ట్ర అసెంబ్లీలో డిబేట్ జరగవలసి ఉందని అన్నారు.  ఈ మేరకు శాసన సభలో అధికారిక ప్రకటన చేశారు. పార్లమెంటులో తమ పార్టీ ఈ చట్టంపై ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ.. నితీష్ వైఖరిలో మార్పు వచ్చినట్టు ఉంది. అలాగే ఎన్నార్సీని బీహార్లో అమలు చేసే ప్రసక్తి గానీ, ఆ  అవసరం గానీ లేదని కూడా […]

  • Umakanth Rao
  • Publish Date - 3:27 pm, Mon, 13 January 20
బ్రేకింగ్:  సీఏఏ...  ' అభ్యంతరాలున్నాయ్ '  నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన !

వివాదాస్పదమైన సీఏఏపై మొట్టమొదటిసారిగా బీజేపీ మిత్రపక్షమైన జేడీ-యు అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ చట్టంపై తమ రాష్ట్ర అసెంబ్లీలో డిబేట్ జరగవలసి ఉందని అన్నారు.  ఈ మేరకు శాసన సభలో అధికారిక ప్రకటన చేశారు. పార్లమెంటులో తమ పార్టీ ఈ చట్టంపై ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ.. నితీష్ వైఖరిలో మార్పు వచ్చినట్టు ఉంది.

అలాగే ఎన్నార్సీని బీహార్లో అమలు చేసే ప్రసక్తి గానీ, ఆ  అవసరం గానీ లేదని కూడా ఆయన చెప్పారు. నిండు సభలో నితీష్ కుమార్ అధికారికంగా ఈ స్టేట్ మెంట్ చేయడం ఆశ్చర్యకరం. ‘ సవరించిన పౌరసత్వ చట్టంపై మొదట చర్చ జరగాలి.. ప్రజలు కోరితే అప్పుడు ఈ సభలో దీనిపై చర్చ జరుగుతుంది. ఇక ఎన్నార్సీ  సంబంధించి దీన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు.. ఆ అవసరం కూడా లేదు ‘ అని ఆయన అన్నారు. అటు-జేడీ-యు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఆదివారం ఇలాగే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల విషయంలో తమ పార్టీ అధినేత వైఖరికి నిరసనగా ఆయన రాజీనామాకు కూడా సిధ్ధపడుతూ ట్వీట్లు చేశారు.