#Breaking నిర్భయ దోషి సంచలన ఆరోపణ… ఆరోజు లేనేలేడంట!
నిర్భయ కేసులో ఉరి శిక్ష పడిన వారు శిక్ష అమలును వాయిదా వేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. మరో రెండు రోజుల్లో ఉరి శిక్ష అమలు కాబోతున్న తరుణంలోను దోషులు శిక్ష తప్పించుకునేందుకు కుటిలయత్నాలు చేస్తూనే వున్నారు. తాజాగా..
Nirbhaya case convict Mukhesh Singh started new drama: నిర్భయ కేసులో ఉరి శిక్ష పడిన వారు శిక్ష అమలును వాయిదా వేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. మరో రెండు రోజుల్లో ఉరి శిక్ష అమలు కాబోతున్న తరుణంలోను దోషులు శిక్ష తప్పించుకునేందుకు కుటిలయత్నాలు చేస్తూనే వున్నారు. తాజాగా దోషులు ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానానికి పిటిషన్ పెట్టుకోగా.. మంగళవారం… ముఖేశ్ సింగ్ భిన్నమైన వాదనతో పటియాలా కోర్టుకెక్కాడు.
నలుగురు ప్రధాన నిందితుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ కొత్త వాదన మొదలు పెట్టాడు. ఉదంతం జరిగిన డిసెంబర్ 16 రాత్రి తానసలు.. ఢిల్లీలోనే లేనన్న వితండ వాదన వాదన మొదలుపెట్టాడు. డిసెంబర్ 16 రాత్రి తానసలు ఢిల్లీలో లేనేలేనని.. తనను మర్నాడు రాజస్థాన్ నుంచి ఢిల్లీ పోలీసులు పట్టుకొచ్చారంటూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు ముఖేశ్ సింగ్. పోలీసుల పెట్టిన టార్చర్ భరించలేక తాను నేరం అంగీకరించానంటున్నాడీ కిలాడీ.
నేరం జరిగిన రోజు రాత్రి తాను లేనపుడు తనకు ఉరి శిక్ష వేయడం సమంజసం కాదంటూ తనకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలంటూ ముఖేశ్ పటియాల కోర్టులో పిటిషన్ వేశాడు. దీనికి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ముఖేశ్ తరపు న్యాయవాది ఇచ్చిన వివరణను విన్న న్యాయమూర్తి ముందు తీర్పును రిజర్వు చేశారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి సమావేశమైన కోర్టు ముఖేశ్ పిటిషన్‌ను కొట్టి వేశారు. ముఖేశ్ వాదనలో పస లేదని తేలిపోయింది.