AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#CoronaEffect ఢిల్లీలో నిషేధాఙ్ఞలు… రెడ్ అలర్ట్

దేశంలో కరోనా కలవరం రోజురోజుకు రెట్టింపవుతోంది. పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జనసంచారంపై ఆంక్షల విధింపు మొదలైంది. దేశ రాజధానిలో ప్రజా సంచారంపై నిషేధాఙ్ఞలు విధింపు మొదలైంది. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు.

#CoronaEffect ఢిల్లీలో నిషేధాఙ్ఞలు... రెడ్ అలర్ట్
Rajesh Sharma
|

Updated on: Mar 19, 2020 | 12:31 PM

Share

Delhi police commissioner imposed new restrictions in the city: కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో కొత్తగా నిషేధాఙ్ఞాలు విధించారు ఢిల్లీ పోలీసులు. కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడా గుమికూడవద్దని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుడదని సూచించారు.

వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది రోడ్లపైనా.. ఇంకెక్కడా గుమికూడవద్దని ఆదేశించారు. ర్యాలీలు, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని నిబందనలు విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తాజా నిషేధాఙ్ఞలు, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ. మార్చి 31 వరకు ఆదేశాలు వర్తిస్తాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.