52 ఏళ్లు దాటితే ఇంట్లోనే ఉండండి.. డ్యూటీకి రాకండి..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాదు మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందులో ఇటీవల పోలీసు సిబ్బందికి కరోనా రావడం.. అందులో ముగ్గురి ప్రాణాలు పోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ముంబై పోలీస్ ఉన్నతాధికారులు.. సిబ్బంది ఆరోగ్యం పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నుంచి 55 ఏళ్లు […]

52 ఏళ్లు దాటితే ఇంట్లోనే ఉండండి.. డ్యూటీకి రాకండి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 29, 2020 | 7:42 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాదు మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందులో ఇటీవల పోలీసు సిబ్బందికి కరోనా రావడం.. అందులో ముగ్గురి ప్రాణాలు పోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ముంబై పోలీస్ ఉన్నతాధికారులు.. సిబ్బంది ఆరోగ్యం పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నుంచి 55 ఏళ్లు పైబడిన వారు.. విధుల్లోకి రావొద్దని సూచించింది. అంతేకాదు.. 52 ఏళ్లు పైబడి మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న పోలీస్‌ సిబ్బందిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. అయితే ఇటీవల కరోనా మహమ్మారి వల్ల మరణించిన పోలీస్‌ సిబ్బంది.. ప్రస్తుతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్న పోలీస్‌ సిబ్బంది అంతా 50ఏళ్లు దాటిన వారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీపీ ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు. ఇక వైరస్‌ సోకిన తమ సిబ్బందికి ట్రీట్‌మెంట్‌ అందించడానికి పలు ఆస్పత్రులతో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నామని తెలిపారు.