‘ఆయన వెళ్ళిపోయాడు.. నేను కుంగిపోయాను.,, అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ నటుడు రిషికపూర్ ఇక లేరన్న సమాచారం తెలియగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్  చలించిపోయారు. 'ఆయన వెళ్ళిపోయాడు'.. నేను కుంగిపోయాను' అంటూ ట్వీట్ చేశారు.

'ఆయన వెళ్ళిపోయాడు.. నేను కుంగిపోయాను.,, అమితాబ్ బచ్చన్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2020 | 12:11 PM

బాలీవుడ్ నటుడు రిషికపూర్ ఇక లేరన్న సమాచారం తెలియగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్  చలించిపోయారు. ‘ఆయన వెళ్ళిపోయాడు’.. నేను కుంగిపోయాను’ అంటూ ట్వీట్ చేశారు. రిషి, అమితాబ్ ఇద్దరూ కలిసి  కభీ-కభీ, అమర్, అక్బర్, ఆంథోనీ, నసీబ్, కూలీ వంటి చిత్రాల్లో నటించారు. ‘102 నాట్ ఔట్ ఇన్ 2018’ అనే సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిషి కపూర్ ఢిల్లీలోని ఆసుపత్రిలో సుమారు 17 రోజులు చికిత్స పొందారు. ఢిల్లీ కాలుష్యం వల్ల తన ఆరోగ్యం దెబ్బ తిన్నదని  ఆ సందర్భంలో ఆయన ట్వీట్ చేశారు. అప్పుడే ఆయన ఊపిరి తిత్తుల్లో ఓ ‘ప్యాచ్’ ఏర్పడిందని, అది న్యుమోనియాకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్ఛరించారట

కాగా-రిషి కపూర్ తన తండ్రి రాజ్ కపూర్ నటించిన చిత్రాల్లో నటిస్తూ.. తన సినీ కెరీర్ ప్రారంభించారు. బాల నటుడిగా ‘శ్రీ 420’, 1970 నాటి మూవీ ‘మేరా నామ్ జోకర్’ చిత్రాల్లో నటించారు. ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు సాధించారు. అనంతరం బాబీలో హీరోగా మొదటిసారి నటించారు. రఫూ చక్కర్, కర్జ్, అగ్నిపథ్, ముల్క్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరి సారి  2019 లో ది బాడీ, ఝూటా కహీకా , మిస్టర్ కపూర్ సినిమాల్లో విలక్షణ నటన కనబరిచారు.