Breaking:ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఒకరు మృతి

ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. దక్షిణ ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. మరో ఘటనలో మాల్వానీ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనంలో ఒక భాగం కూలింది

Breaking:ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఒకరు మృతి
Follow us

|

Updated on: Jul 16, 2020 | 10:42 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటికి‌‌ తీసింది. సుమారు 20 మందికిపైగా ‌శిధిలాల‌ కింద ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

ముంబైలో భారీ వర్షాలకు గురువారం రెండు భవనాలు కుప్పకూలాయి. దక్షిణ ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. మరో ఘటనలో మాల్వానీ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనంలో ఒక భాగం కూలింది. ఈ ఘటనలో శిధిలాల కింద కొందరు చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే శిథిలా నుంచి ఇద్దర్ని బయటికి తీసి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నాలుగు ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు.

కాగా, వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరదనీటితో మునిగాయి. పాత భవనాలు కూలిపోతున్నాయి. కాగా, మరో 18 గంటలపాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.