ఒడిశా కీలక నిర్ణయం.. జూలై 31న లాక్‌డౌన్ పొగింపు

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో 14 రోజుల‌పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ను రాష్ట్ర‌మంత‌టా కాకుండా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఒడిశా స‌ర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఒడిశా కీలక నిర్ణయం.. జూలై 31న లాక్‌డౌన్ పొగింపు

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరగుతూనే ఉంది. అన్ లాక్‌ ప్రక్రియ ప్రారంభమవడంతో జనం రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు గాలికి వదిలేడంతో కరోనా కట్టడికి బ్రేకులు లేకుండాపోయాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాలు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించడం తప్ప గత్యంతరం లేదని భావిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో 14 రోజుల‌పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ను రాష్ట్ర‌మంత‌టా కాకుండా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఒడిశా స‌ర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది. ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియాలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. జూలై 17న‌ శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి జూలై 31న అర్ధరాత్రి వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌తుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఒడిశా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠీ పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లోని వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రాకపోకలపై అంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ‌