కర్ణాటకలో 50 వేల మార్క్ దాటికి కరోనా కేసులు
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు యాభై వేల మార్కును..

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు యాభై వేల మార్కును దాటేశాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 51,422కి చేరింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19,729 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 104 మంది మరుణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 1,032 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరులోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బెంగళూరు నగరంలో కొత్తగా 2,344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4,169 new COVID-19 cases and 104 deaths reported in Karnataka today, taking total number of cases to 51,422 cases including 19,729 recoveries and 1032 deaths. Bengaluru reported 2344 new cases and 70 deaths in the last 24 hours: State Health Department pic.twitter.com/GgqGDnMcY6
— ANI (@ANI) July 16, 2020



