హైదరాబాద్‌ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..

హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా..ఆమెకు పాజిటివ్‌గా తేలింది. కలెక్టర్‌తో..

  • Publish Date - 9:35 pm, Thu, 16 July 20 Edited By:
హైదరాబాద్‌ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..

హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా..ఆమెకు పాజిటివ్‌గా తేలింది. కలెక్టర్‌తో పాటు.. డ్రైవర్‌కు, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై వేలకు చేరువైంది.