భారత్-పాక్ అణుయుద్ధంతో కలిగే నష్టాలేంటి..?

భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్‌ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. జరిగిన పూల్వామా ఉగ్రదాడి సమయంలో భారత్, పాక్‌లు హోరాహొరీగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా.. తాజాగా.. కశ్మీర్ స్వయం ప్రత్తి విషయంలో పాక్.. భారత్‌పై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతూ ఉంది. ఆర్థికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్‌ల మధ్య […]

భారత్-పాక్ అణుయుద్ధంతో కలిగే నష్టాలేంటి..?
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 9:58 AM

భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్‌ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. జరిగిన పూల్వామా ఉగ్రదాడి సమయంలో భారత్, పాక్‌లు హోరాహొరీగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా.. తాజాగా.. కశ్మీర్ స్వయం ప్రత్తి విషయంలో పాక్.. భారత్‌పై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతూ ఉంది. ఆర్థికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

కాగా.. ఆర్థికల్ 370 రద్దుపై తమ అక్కసును వెళ్లగక్కుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాటల యుద్ధాలే చేశారు. ఈ పరిణామాలతో.. ఒకవేళ యుద్ధం మొదలైతే.. ఏం జరుగుతుంది..? ఎంత నష్టం జరుగుతుంది?. ఈ యుద్ధం అణు యుద్ధానికి దారితీస్తే.. ఏమౌతుంది..? తాజాగా.. ఈవిషయంపై అధ్యయనం చేశారు అమెరికాలోని రట్‌గర్స్ యూనివర్శిటీ స్టూడెంట్స్. ఈ వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. ఈ ఆర్టికల్‌పై ప్రపంచదేశాల నడుమ చర్చ జరుగుతోంది.

పరిశోధనలో విద్యార్థుల అధ్యయనం చేసిన కీ పాయింట్స్:

1. అణు యుద్ధం వల్ల.. కొన్ని వారాల్లోనే సుమారు 16 నుంచి 36 మిలియన్ టన్నుల పొగ వాతావరణాన్ని కప్పేస్తుంది 2. ఈ పొగ 10 సంవత్సరాలైనా.. వాతావరణాన్ని వీడదు 3. భూమిని చేరే సూర్యకాంతి క్షీణిస్తుంది. 4. పొగ కారణంగా.. సూర్యుని నుంచి రేడియేషన్స్ గ్రహించి గాలిని వేడెక్కిస్తుంది. 5. దీంతో.. మానవులతో సహా ఏ జీవి ఎక్కువ రోజులు బ్రతకలేదు 6. వర్షపాతం క్షీణిస్తుంది 7. నీరు, గాలి పూర్తిగా కలుషితమవుతాయి 8. సముద్రాల నుంచి ఆహారోత్పత్తి క్షీణిస్తుంది. 9. అడవులు నశిస్తాయి. వృక్ష సంపద నశిస్తుంది. 10. ఈ అణు యుద్ధం వల్ల ఇరు దేశాల్లో కలిగే మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే.. 100 నుంచి 125 మిలియన్ల ప్రజలు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా.. ప్రపంచంలోనే 9 దేశాల వద్దనే అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రస్తుతం.. భారత్, పాక్‌ కూడా వీటిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. కానీ.. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పాడితే.. మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని.. యూనివర్శిటీ విద్యార్థులు చెప్పుకొచ్చారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు