ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై..!

విశాఖ: విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారం సభలో ముగ్గురు సీఎంలు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఈ సభ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల ముందు కూడా ఇదే మైదానంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. అప్పట్లో ఆ సభ పార్టీకి కొత్త ఊపు […]

ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై..!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 31, 2019 | 9:06 AM

విశాఖ: విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారం సభలో ముగ్గురు సీఎంలు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఈ సభ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల ముందు కూడా ఇదే మైదానంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. అప్పట్లో ఆ సభ పార్టీకి కొత్త ఊపు తెచ్చిపెట్టింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న విశాఖలో ఈసారి ప్రతిష్టాత్మిక పోటీ నెలకొంది. అందుకే టీడీపీ ఎన్నికల ముందు భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయడానికి ఈ సభ నిర్వహించబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈసారి ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనవడు శ్రీభరత్‌, వైసీపీ తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో విశాఖలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.