పట్టపగలు లారీ చోరీ.. పట్టుకునేందుకు పోలీసులు, యువకుల చేజింగ్.. చివరికి 60 కి.మీ.ల దూరంలో..!

ఓ దుండగుడు లారీ ఎత్తుకెళ్ళాడు.. ఎత్తుకెళ్ళిన వాడు పాత నేరస్తుడు. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడు. లారీని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 60 కిలోమీటర్లు చేజింగ్ చేశారు. వారికి స్థానిక యువకులు తోడయ్యారు. చివరికి...

  • Updated On - 6:11 pm, Sun, 22 November 20 Edited By: Pardhasaradhi Peri
పట్టపగలు లారీ చోరీ.. పట్టుకునేందుకు పోలీసులు, యువకుల చేజింగ్.. చివరికి 60 కి.మీ.ల దూరంలో..!

Lorry theft Police super chasing: తమిళనాడులోని తిరుచ్చి పట్టణంలో పట్టపగలు చోరీకి గురైన ఓ లారీని సినిమా ఫక్కీలో 60 కి.మీ ఛేజింగ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది . తిరుచ్చి మనప్పారైలో ఉన్న ప్రైవేటు రైస్ మిల్లు ఓనర్‌కు చెందిన లారీని ఆదివారం ఉదయం ఓ వ్యక్తి హఠాత్తుగా తీసుకెళ్లాడు. దీనిని గమనించిన రైస్ మిల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లారీ వెళుతున్న మార్గంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను అప్రమత్తం చేశారు. బ్యారికేడ్లు అడ్డు పెట్టి లారీని నిలిపేందుకు యత్నించారు. కానీ లారీని ఎత్తుకెళ్ళిన ఆగంతకుడు వాటిని ఢీకొట్టి వేగంగా లారీని నడిపాడు. దీంతో పోలీసులు, కొందరు యువకులు మూడు కార్లలో లారీని ఛేజింగ్ చేశారు. లారీ, దాని వెనకాల మూడు కార్లు వేగంగా పోతుండడం చూసి ప్రజలు షాక్ గురయ్యారు. తిరుచ్చి నుంచి 60 కి.మీ. దూరంలోని అరియమంగళం పాల డిపో వద్ద పోలీసులు లారీని అడ్డుకొని, అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అతన్ని తిరుచ్చి అరియమంగళంకు చెందిన పిచ్చుమణిగా గుర్తించిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు.

ALSO READ: టాలీవుడ్‌కు కేసీఆర్ అభయ హస్తం.. త్వరలో రాయితీల ప్రకటన!

ALSO READ: సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై అలర్ట్.. కేసీఆర్ కీలక సమీక్ష

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ ఖరారు.. నిర్దిష్ట ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి

ALSO READ: విశాఖలో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. గుట్టు రట్టు చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు