వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ ఖరారు.. నిర్దిష్ట ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్టే వెకేట్ ఖాయం!

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీని ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైకోర్టులో స్టే వెకేషన్‌కు ఛాన్స్ వుందంటున్న ముఖ్యమంత్రి.. భూముల విలువను ఆల్‌రెడీ ఖరారు చేసినందున స్టే ఎత్తివేసిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు.

  • Rajesh Sharma
  • Publish Date - 3:53 pm, Sun, 22 November 20

Non-agri assets registrations soon: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నవంబరర్ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కోర్టు వివాదాలున్నందున ముందు అనుకున్నట్లుగా నవంబర్ 23వ తేదీన కాకుండా 25వ తేదీన ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా వుండాలని ఆయన నిర్దేశించారు. ఆస్తుల విలువ ముందే నిర్ణయించినందున రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఎలాంటి అడ్డంకి లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేత ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని సిఎం వెల్లడించారు.

ALSO READ: టాలీవుడ్‌కు కేసీఆర్ అభయ హస్తం.. త్వరలో రాయితీల ప్రకటన!

ALSO READ: సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై అలర్ట్.. కేసీఆర్ కీలక సమీక్ష