విశాఖలో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. గుట్టు రట్టు చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. ఐదుగురు అరెస్టు

సాగర తీరంలో మరో డ్రగ్స్ దందా గుట్టు రట్టయ్యింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆటకట్టించారు. అయిదుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు.

విశాఖలో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. గుట్టు రట్టు చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. ఐదుగురు అరెస్టు
Follow us

|

Updated on: Nov 22, 2020 | 6:03 PM

Drugs rocket burst in Visakha city: సాగర తీరంలో మరో డ్రగ్స్ దందా గుట్టు రట్టయ్యింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆటకట్టించారు. అయిదుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు. కాగా డ్రగ్స్ దందాపై నగర పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా సీరియస్ అయినట్లు సమాచారం.

స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందడంతో విశాఖపట్నంలో ఓ డ్రగ్స్ ముఠా గుట్టురట్టయ్యింది. అరవింద్ అగర్వాల్ సహా అయిదుగురిని పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్ అలియాస్ బిల్లా, మైఖేల్ వెల్ కం, మురళీధర్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అశోక్ అనే మరో నిందితుడు పరారీలో వున్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

33కు పైగా ఎల్.ఎస్.డీ. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. యువత, విద్యార్ధులే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠా దందా నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ దందాపై సీపీ మనీష్ కుమార్ సిన్హా సీరియస్ అయినట్లు సమాచారం. మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు డ్రగ్స్ స్మగ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 21న సర్వేశ్వరరెడ్డి అనే ఇంటర్ స్టేట్ డ్రగ్ స్మగ్లర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సర్వేశ్వర్ రెడ్డి నుంచి గంజాయి, చరస్ స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: టాలీవుడ్‌కు కేసీఆర్ అభయ హస్తం.. త్వరలో రాయితీల ప్రకటన!

ALSO READ: సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై అలర్ట్.. కేసీఆర్ కీలక సమీక్ష

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ ఖరారు.. నిర్దిష్ట ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి