మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ
లాక్‌డౌన్ కొనసాగింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మే 3వ తేదీ తర్వాత మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. బుధవారం దేశంలోని తాజా పరిస్థితిపైనా, లాక్ డౌన్ కొనసాగింపుపైనా, కరోనా వైరస్ నియంత్రణ చర్యలపైనా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
లాక్‌డౌన్ కొనసాగింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మే 3వ తేదీ తర్వాత మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. బుధవారం దేశంలోని తాజా పరిస్థితిపైనా, లాక్ డౌన్ కొనసాగింపుపైనా, కరోనా వైరస్ నియంత్రణ చర్యలపైనా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో అనేక ఇబ్బందులు తలెత్తి నప్పటికీ ప్రజలందరి ప్రాణాలు కాపాడుకోవాలంటే, దేశాన్ని పరిరక్షించుకోవాలి అంటే లాక్ డౌన్ కొనసాగింపు ఒక్కటే మార్గమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆయన తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగింపునకు మొగ్గు చూపుతున్నాయని, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు.
మే 3వ తేదీ తర్వాత ఎక్కడైతే కరోనా వైరస్ ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాలలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రాంతాలలో ఎలాంటి మినహాయింపులు ఉండవని కొన్ని గ్రీన్ జోన్లలో మాత్రమే మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అన్ని రకాల ప్రయాణ సాధనాలపై, షాపింగ్ మాల్స్‌పై, సినిమా హాల్స్, బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
రాపిడ్ టెస్టింగ్ కిట్లపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి. ఒక్క చైనా నుంచి దిగుమతి అయిన నాసిరకం కిట్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాణ్యత కలిగిన టెస్టింగ్ కిట్లను వినియోగించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కలిగించిందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు
Read this: రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు
Read this: ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు
Read this: కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్
Read this: లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు
Read this: ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్
Read this: కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?
Read this: సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం
Read this: కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!
Read this: గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి