ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు

ఇవాళ ఉదయం పదిన్నరకు ఏపీ కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు రుణమాఫీ విడుదలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అన్నదాత సు ఖీభవ పథకంలో పెట్టుబడి సాయం పెంపునకు కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీపై కేబినెట్ లో చర్చించనున్నారు మంత్రులు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పదోన్నతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 20 సంవత్సరాల సర్వీస్ దాటిన వారికి హెడ్ కానిస్టేబుల్ […]

ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 25, 2019 | 10:16 AM

ఇవాళ ఉదయం పదిన్నరకు ఏపీ కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు రుణమాఫీ విడుదలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అన్నదాత సు ఖీభవ పథకంలో పెట్టుబడి సాయం పెంపునకు కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీపై కేబినెట్ లో చర్చించనున్నారు మంత్రులు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పదోన్నతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 20 సంవత్సరాల సర్వీస్ దాటిన వారికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించనున్నారు. అర్చకులకూ అన్నదాట సుఖీభవ పథకం అమలుకు ఆమోదం తెలపనున్నారు. అర్చకులకు పూర్తి హక్కుల కల్పనపై లా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది.