సీఏఏపై మాతో కలిసి రండి… 11 బీజేపీయేతర రాష్ట్రాలకు విజయన్ లేఖ
వివాదాస్పదమైన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 11 నాన్-బీజేపీ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. సవరించిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఇటీవల ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ మీరు కూడా ఇలాగే మీ శాసన సభల్లో తీర్మానాన్ని ఆమోదించాలని, ప్రజాస్వామ్యాన్ని, యూనిటీని కాపాడాలని ‘ విజయన్ ఈ లేఖలో కోరారు. దేశంలోని అనేక చోట్ల సిటిజెన్ షిప్ చట్టాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు, […]
వివాదాస్పదమైన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 11 నాన్-బీజేపీ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. సవరించిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఇటీవల ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ మీరు కూడా ఇలాగే మీ శాసన సభల్లో తీర్మానాన్ని ఆమోదించాలని, ప్రజాస్వామ్యాన్ని, యూనిటీని కాపాడాలని ‘ విజయన్ ఈ లేఖలో కోరారు. దేశంలోని అనేక చోట్ల సిటిజెన్ షిప్ చట్టాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతుండగా.. దీన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం కేరళ.
బీజేపీ మిత్రపక్షమైన జేడీ-యు అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కూడా ఆయన లేఖ పంపడం విశేషం. ఈ దేశ సెక్యులరిజాన్ని, డెమోక్రసీని పరిరక్షించేందుకు మనమంతా సమైక్యంగా ఉండాలని ఆయన అభ్యర్థించారు. ఈ సమాజంలోని వివిధ వర్గాలవారు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని, సీ ఏఏ వల్ల తలెత్తే తీవ్ర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని విజయన్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, (మమతా బెనర్జీ), ఢిల్లీ (అరవింద్ కేజ్రీవాల్), ఝార్ఖండ్ (హేమంత్ సొరేన్), మహారాష్ట్ర (ఉధ్ధవ్ థాక్రే), బీహార్ (నితీష్ కుమార్), ఆంధ్రప్రదేశ్ (వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి), మధ్యప్రదేశ్ (కమల్ నాథ్), పంజాబ్ (అమరేందర్ సింగ్), రాజస్థాన్ (అశోక్ గెహ్లాట్), ఒడిశా (నవీన్ పట్నాయక్), పుదుచ్ఛేరి (వి.నారాయణస్వామి) రాష్ట్రాలకు విజయన్ ఈ మేరకు లేఖలు పంపారు. కాగా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ చట్టాన్ని దుయ్యబట్టారు. ఇది అనవసరమైన చట్టమని, హిందువులు, ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన మండిపడ్డారు.