AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.70లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిన జపాన్ సర్కార్..!

కొవిడ్ రక్కసి నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు చిన్న దేశమైన పెద్ద మనసు చాటుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను జపాన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. 1.1 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.70లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఇది రెండోసారి. వీటిలో కొంత […]

రూ.70లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిన జపాన్ సర్కార్..!
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 6:52 PM

Share

కొవిడ్ రక్కసి నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు చిన్న దేశమైన పెద్ద మనసు చాటుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను జపాన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. 1.1 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.70లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఇది రెండోసారి. వీటిలో కొంత మొత్తాన్ని నేరుగా ఖర్చుచేస్తామని జపాన్ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోసారి కరోనా మహమ్మారి విజృంభించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అక్కడి అధికారులను ఆదేశించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే గతనెలలో మొదటి దఫా దాదాపు లక్ష ట్రిలియన్‌ డాలర్లను జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు కలిపి 2.18 ట్రిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.150లక్షల కోట్లు కేటాయించినట్లు అయ్యింది. ఇది జపాన్‌ దేశ జీడీపీలో దాదాపు 40శాతమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచంలో అత్యధికంగా ఖర్చు పెట్టిన దేశాల్లో అమెరికా సరసన జపాన్‌ చేరింది. అమెరికా దాదాపు 2.3 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. కేవలం ఇప్పటి వరకు దేశంలో 17వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 825 మరణాలు మాత్రమే సంభవించాయి.

Follow Us
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌
గ్లామర్ గేరు మార్చిన రాశీఖన్నా
గ్లామర్ గేరు మార్చిన రాశీఖన్నా