నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్
దర్శకుడిగా నాగశౌర్యతో వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న శ్రీనివాస్ అవసరాల.. అతడితోనే మూడో సినిమాకు సిద్ధమయ్యాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. కాగా తన గత చిత్రాల టైటిళ్లలాగే ఈ మూవీకి అవసరాల ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశాడట. ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఈ మూవీ కోసం రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దాసరి ప్రొడక్షన్స్, ప్యూపుల్ […]
దర్శకుడిగా నాగశౌర్యతో వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న శ్రీనివాస్ అవసరాల.. అతడితోనే మూడో సినిమాకు సిద్ధమయ్యాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. కాగా తన గత చిత్రాల టైటిళ్లలాగే ఈ మూవీకి అవసరాల ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశాడట. ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఈ మూవీ కోసం రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దాసరి ప్రొడక్షన్స్, ప్యూపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.