ఆగస్టు 12 వరకు రైళ్ల రద్దు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత రైల్వేశాఖ. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా అన్ని సర్వీసు రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది.

ఆగస్టు 12 వరకు రైళ్ల రద్దు
Follow us

|

Updated on: Jun 25, 2020 | 10:03 PM

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత రైల్వేశాఖ. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా అన్ని సర్వీసు రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది. అయితే, ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. అలాగే, జూలై 1 నుంచి ఆగస్టు 12 మధ్య కాలానికి గానూ బుక్ చేసుకున్న టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి టికెట్ల మొత్తాన్ని పూర్తిగా వాపసు చేయనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది.