పాకిస్తాన్ నుంచి భారత్ వైపు కదులుతున్న దండు..!

కోట్లాది మిడతల దండు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి వస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో భారీగా పంట నష్టం కలిగిస్తోంది. గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువగా మిడతల దండు దాడి చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లతో నియంత్రించేందుకు ఫ్లాన్ చేసింది. పాక్ నుంచి వస్తున్న మిడతలు సరిహద్దు ప్రాంతాల రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలో పంట మీద […]

పాకిస్తాన్ నుంచి భారత్ వైపు కదులుతున్న దండు..!
Follow us

|

Updated on: May 22, 2020 | 5:49 PM

కోట్లాది మిడతల దండు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి వస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో భారీగా పంట నష్టం కలిగిస్తోంది. గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువగా మిడతల దండు దాడి చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లతో నియంత్రించేందుకు ఫ్లాన్ చేసింది. పాక్ నుంచి వస్తున్న మిడతలు సరిహద్దు ప్రాంతాల రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలో పంట మీద దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. రైతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మిడతల గుంపును ఆపలేకపోతున్నారు. మరోవైపు పాక్ నుంచి వస్తున్న ఈ మిడతలు చాలా ప్రమాదకరమైనవి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రోజుకు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని.. ఒక చదరపు మీటరు సమూహంలో ఉన్న మిడతలు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని తినేస్తున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇప్పటికే ఈ మిడతల గుంపు దాడులో సరిహద్దు రాష్ట్రాల్లో 3 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. మిడతల దండు దాడిపై దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వాటి నివారణకు నడుంబిగించింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మిడతల నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూం నుం ఏర్పాటు చేసింది. దీనిద్వారా 50 స్ప్రేయింగ్ పరికరాలు, వాహనాలతో మిడతలను నివారించాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే బ్రిటన్ నుంచి ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్ల దిగుమతి చేస్తుకున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు ఆఫ్రికాలో తుపాన్ల వల్ల మిడతల సంతానోత్పత్తి పెరిగిందని, ఫలితంగా భారత్, చైనా, పాకిస్థాన్‌ దేశాల్లోని పంటలకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే అప్రమత్తం చేసింది. వీటి దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఇప్పటికే వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మిడతల దండును అదుపు చేయలేకపోతే ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.