దేశంలో కరోనా కలవరం, ఒక్క రోజులో 1,179 మరణాలు

|

Sep 30, 2020 | 10:33 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1,179 మంది వైరస్ కారణంగా చనిపోయారు.

దేశంలో కరోనా కలవరం, ఒక్క రోజులో 1,179 మరణాలు
Follow us on

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1,179 మంది వైరస్ కారణంగా చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 62,25,764కి చేరింది. మరణాల సంఖ్య 97,497కి పెరిగింది. ఇప్పటివరకు 51,87,825 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 86,428 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,40,441  యాక్టీవ్ కేసులున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33శాతం ఉండగా, డెత్ రేటు 1.57శాతంగా ఉంది.

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా తర్వాత భారత్ సెకండ్ ప్లేసులో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే… మొత్తం మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్… మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా ఫస్ట్ ప్లేసులో ఉండటం కలవరపెట్టే అంశం.

Also Read :

Breaking : పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ !

ఏపీ : నేడు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులు ప్రకటన !