COVID-19 హైద్రాబాద్ పోలీసుల మాస్టర్ ప్లాన్ ఇదే

కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు చాలా స్లోగా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించి, పక్కాగా చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది.

COVID-19 హైద్రాబాద్ పోలీసుల మాస్టర్ ప్లాన్ ఇదే
Follow us

|

Updated on: Apr 24, 2020 | 11:43 AM

కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు చాలా స్లోగా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించి, పక్కాగా చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేస్తామంటున్నారు నగర పోలీసులు.

పోలీస్ స్టేషన్‌ల వారీగా కరోనా పాజిటివ్ కేసులను పోలీసు విభాగం విశ్లేషిస్తోంది. పాజిటివ్ కేసుల గణాంకాలతో మ్యాపింగ్ రెడీ చేశారు. ప్రాంతాల వారీగా కేసులను ఇప్పటికే గుర్తించిన పోలీసు శాఖ వాటి ఆధారంగా ఓ మ్యాప్ రెడీ చేశారు. పాజిటివ్ కేసులను గుర్తించి వారి ఇళ్ల వద్ద సాధారణ ప్రజల సంచారాన్ని గుర్తించేలా వ్యూహం రూపొందించారు. సీసీ కెమెరాల ద్వారా పాజిటివ్ కేసుల పరిసరాల్లోని వివరాల సేకరిస్తున్నారు.

సీసీ కెమెరాల ఐడెంటిఫికేషన్ ద్వారా కోవిడ్ పరీక్షలు క్వారెంటైన్‌కు తరలించనున్నారు అధికారులు. పోలీసు స్టేషన్ల వారీగా ఎన్నెన్ని కేసులున్నాయో ఇప్పటికే గుర్తించారు అధికారులు. గోల్కొండ, హఫీజ్ పేట్, బహుదూర్ పుర, రెయిన్ బజార్, కాలా పత్తర్ ప్రాంతాల్లో అత్యధికంగా 20 నుంచి 50 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. చంద్రాయణగుట్ట, మల్కాజ్ గిరి, ముషీరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 10 నుంచి 20 కేసులను ఐడెంటిఫికేషన్ చేశారు. మాదన్నపేట్, చిలకలగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో 2 నుంచి 5 కేసులు గుర్తించారు. దీనికి అనుగుణంగా చర్యలు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.