AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజీరియా జైలుపై బాంబులు, గ్రెనేడ్లతో సాయుధుల దాడి.. తప్పించుకుని పారిపోయిన 1,844 మంది ఖైదీలు

నైజీరియాలో ఓ జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 1800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు.

నైజీరియా జైలుపై బాంబులు, గ్రెనేడ్లతో సాయుధుల దాడి.. తప్పించుకుని పారిపోయిన 1,844 మంది ఖైదీలు
Attack On Nigerian Prison
Balaraju Goud
|

Updated on: Apr 07, 2021 | 8:14 AM

Share

Nigerian prisoners escape: నైజీరియాలో ఓ జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 1800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. మెషీన్ గ‌న్ను, రాకెట్ గ్రేనేడ్లతో స్థానిక మిలిటెంట్లు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఓవెరి ప‌ట్టణంలో ఉన్న జైలుపై సోమ‌వారం తెల్లవారుజామున రెండు గంట‌ల‌కు సాయుధులు అటాక్ చేశారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు.

అయితే, ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు తిరిగి వెనక్కి వచ్చారు. నిషిద్ధ ‘ ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా’ (ఐపీఓబీ) సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. మరోవైపు, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

ఐమో రాష్ట్రంలోని ఈ జైలు నుంచి మొత్తంగా 1,844 మంది ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు గంట‌ల పాటు సాగిన కాల్పుల్లో.. పోలీసులు, మిలిట‌రీ బిల్డింగ్‌ల‌పై సాయుధులు దాడి చేశారు. అయితే పారిపోయిన ఖైదీల‌ను ప‌ట్టుకునేందుకు ప్రభుత్వ ప్రత్యేక ద‌ళాలు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి.

Read Also…  Pariksha Pe Charcha 2021: నేడు విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖీ.. వర్చువల్ పద్దతిలో ‘పరీక్షా పే చర్చ’

Follow Us
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి" ట్రై చేయండి
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు!
డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు!
SA vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ రోడ్ మ్యాప్ రెడీ
SA vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ రోడ్ మ్యాప్ రెడీ
టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది
టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది
మీకో సవాల్.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను 7 సెకన్లలో గుర్తించండి!
మీకో సవాల్.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను 7 సెకన్లలో గుర్తించండి!