బ్రేకింగ్: పేలుళ్ల సూత్రధారి తండ్రి, సోదరులు హతం!

బ్రేకింగ్: పేలుళ్ల సూత్రధారి తండ్రి, సోదరులు హతం!

కొలంబో: శ్రీలంక పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు జహ్రామ్‌ హషీమ్‌.. తండ్రి, ఇద్దరు సోదరులు మృతి చెందినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఉగ్రవాదులపై శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనలో వారు హతమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి బంధువుతో పాటు పోలీసు వర్గాలు ధ్రువీకరించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. మరణించిన వారిలో జహ్రాన్‌ సోదరులు జైనీ హషీమ్‌, రిల్వాన్‌ హషీమ్‌ తండ్రి మహ్మద్‌ హషీమ్‌ […]

Ram Naramaneni

|

Apr 28, 2019 | 5:42 PM

కొలంబో: శ్రీలంక పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు జహ్రామ్‌ హషీమ్‌.. తండ్రి, ఇద్దరు సోదరులు మృతి చెందినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఉగ్రవాదులపై శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనలో వారు హతమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి బంధువుతో పాటు పోలీసు వర్గాలు ధ్రువీకరించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. మరణించిన వారిలో జహ్రాన్‌ సోదరులు జైనీ హషీమ్‌, రిల్వాన్‌ హషీమ్‌ తండ్రి మహ్మద్‌ హషీమ్‌ ఉన్నట్లుగా పేర్కొన్నారు. పేలుళ్ల అనంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఉగ్రవాదులకు చెందిన వీడియోలోనూ వీరు ముగ్గురు ఉన్నట్లు జహ్రాన్‌ దగ్గరి బంధువు నియాజ్‌ షరీఫ్‌ తెలిపాడు. కాగా.. ఆదివారం నాటి పేలుళ్లలో జహ్రాన్‌ హషీమ్‌ కూడా తనని తాను పేల్చుకున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించిన విషయం తెలిసిందే.

నిఘా సమాచారం మేరకు శుక్రవారం రాత్రి కల్మునై నగరంలో సైంథముర్తు ప్రాంతంలో ఓ నివాసంపై  భద్రతా బలగాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంట్లో మకాం వేసిన ముష్కరులు బలగాలపై కాల్పులకు దిగారు. ఇరుపక్షాల మధ్య కాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. పోరు తీవ్రం కావడంతో ముగ్గురు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురు దుండగులు జహ్రాన్‌ తండ్రి, సోదరులేనన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది చనిపోగా అందులో ఒక సాధారణ పౌరుడు ఉన్నారు. అక్కడి నుంచి భారీగా డిటోనేటర్లు, ఆత్మాహుతి బాంబుదాడి కిట్‌లు, సైనిక దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu