AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర మంత్రి కారుపై రాళ్ల దాడి.. పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

పశ్చిమబెంగాల్‌లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసాన్‌సోల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారు ధ్వంసమైంది. ఘటన సమయంలో సుప్రియో కారులోనే ఉన్నారు. కాగా దీనిపై వెంటనే అప్రమత్తమైన […]

కేంద్ర మంత్రి కారుపై రాళ్ల దాడి.. పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 29, 2019 | 11:51 AM

Share

పశ్చిమబెంగాల్‌లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసాన్‌సోల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారు ధ్వంసమైంది. ఘటన సమయంలో సుప్రియో కారులోనే ఉన్నారు. కాగా దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

మరోవైపు ఈ ఘటనపై బబుల్ సుప్రియో స్పందిస్తూ.. ‘‘ఓటేసేందుకు నన్ను ఓటర్లు అనుమతించలేదు. ఇది మన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు. అయితే జాతీయ దళాలు వచ్చేవరకు ఓటింగ్‌ను ప్రారంభించకూడదని బీజేపీ కార్యకర్తలు వాదిస్తుండగా.. వారితో సంబంధం లేకుండా పోలింగ్‌ను కొనసాగించాలని టీఎంసీ కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి