AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!

మానవత్వం మంటగలిసింది. మనిషి అనే పదాన్ని మరిచిపోతున్నారు. విజయనగరం జిల్లాలో మానవ మృగం ఒకటి రెచ్చిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో వాయిస్ కాల్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!
Balaraju Goud
|

Updated on: Jul 12, 2020 | 11:54 AM

Share

మానవత్వం మంటగలిసింది. మనిషి అనే పదాన్ని మరిచిపోతున్నారు. విజయనగరం జిల్లాలో మానవ మృగం ఒకటి రెచ్చిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో వాయిస్ కాల్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

గుండెలు తరుక్కుపోయే ఘటన సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పైల మైనరుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలు కావడంతో అదే ఊరిలో వారు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. అయితే, మొదటి నుంచి మైనర్ కు పెద్ద కుమార్తెపై కన్నుపడింది. తాను తండ్రి అన్న విచక్షణ మరిచిపోయాడు కసాయి. కన్న కూతురును భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఇలా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఇదే క్రమంలో గత శుక్రవారం భార్య ఆరోగ్యం బాగులేందున పెద్దకుమార్తెను తీసుకురమ్మని చిన్నకుమార్తెను పంపించాడు. తండ్రి కబురుతో కన్నవారింటికి వచ్చిన పెద్ద కుమార్తెపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత కొన్నినెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పేర్కొంది. ఎట్టకేలకు విసిగిపోయిన అభాగ్యురాలు, తండ్రి నుంచి కాపాడాలంటూ పోలీసులకు వీడియో వాయిస్ పంపింది. దీంతో దుర్మార్గుడి బండారం బయటపడింది. వీడియో వాయిస్ అధారంగా ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..