షర్మిల మొదటి టార్గెట్ ఎవరో తెలుసా?
విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ పార్టీ తరుపున జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మ బరిలోకి దిగబోతున్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి జగన్ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాయలసీమ నుంచి ప్రచారం మొదలుపెట్టి కోస్తావైపు పర్యటిస్తారని వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. విజయమ్మ పోటీకి దూరంగా ఉండి ప్రచారానికే పరిమితం కానున్నారు. మరోపక్క సోదరి షర్మల గుంటూరు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించి కోస్తావైపుకు వెళతారని వైసీసీ […]
విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ పార్టీ తరుపున జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మ బరిలోకి దిగబోతున్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి జగన్ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాయలసీమ నుంచి ప్రచారం మొదలుపెట్టి కోస్తావైపు పర్యటిస్తారని వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. విజయమ్మ పోటీకి దూరంగా ఉండి ప్రచారానికే పరిమితం కానున్నారు. మరోపక్క సోదరి షర్మల గుంటూరు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించి కోస్తావైపుకు వెళతారని వైసీసీ నాయకులు చెబుతున్నారు.
ఈ నెల 29వ తేదీ నుంచి షర్మిల ప్రచారం ప్రారంభించనున్నారు. అయితే ఆమె తన ప్రచారానికి మొదటి ప్లేస్‌గా మంగళగిరిని ఎంచుకున్నారు. దీంతో షర్మిల తన మొదటి టార్గెట్‌గా లోకేశ్‌ను ఎంచుకున్నట్టు అర్ధమౌతుంది. అయితే షర్మిల ప్రచారాన్ని టీడీపీ లైట్ తీసుకుంటుంది. గతంలో మాదిరిగానే జగనన్న వదిలిన బాణం తిరిగి ఆయనకే తగులుతుందని టీడీపీ నాయకులు బాబూ రాజేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారు. మరి ఈసారైనా షర్మిల తన టార్గెట్‌ను చేరుకుంటారా లేదా? అన్నది చూడాలి.