డాడీ సేఫ్.. శివాత్మికా ట్వీట్..!

హీరో రాజశేఖర్ రోడ్‌ యాక్సిడెంట్‌పై కూతురు శివాత్మికా స్పందించింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై డాడీ కారు ప్రమాదానికి గురైన మాట నిజమనేనని.. అయితే ప్రస్తుతం ఆయన సేఫ్‌గా ఉన్నారని.. ఆయన క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన  మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై రాజశేఖర్‌ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. హైవేపై అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపుతప్పి […]

డాడీ సేఫ్.. శివాత్మికా ట్వీట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2019 | 10:04 AM

హీరో రాజశేఖర్ రోడ్‌ యాక్సిడెంట్‌పై కూతురు శివాత్మికా స్పందించింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై డాడీ కారు ప్రమాదానికి గురైన మాట నిజమనేనని.. అయితే ప్రస్తుతం ఆయన సేఫ్‌గా ఉన్నారని.. ఆయన క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన  మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.

ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై రాజశేఖర్‌ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. హైవేపై అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. కారు బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. అయితే.. ఈ ఘటనలో రాజశేఖర్‌తో పాటు మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కారులో వీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన కారును పోలీసులు.. సీజ్ చేశారు. ఈ కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ప్రమాద సమయంలో కారు స్పీడ్ 180 కి.మీ. ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత వేరే కారులో రాజశేఖర్ వెళ్లిపోయాడు. ఆయన కారుపై ఇప్పటికే మూడు ఓవర్ స్పీడ్ పెండింగ్ చలాన్లు నమోదైనట్లు సమాచారం.