AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మందు బ్లాక్ మార్కెట్ దందా గుట్టురట్టు

ప్రజల ప్రాణాలతో కరోనా చెలగాటమాడుతుంటే, ఇదే అదునుగా భావించిన కొందరు వారి ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు. మందు లేక ఇబ్బందులుపడుతున్న వారికి ఉపశమనంగా ఉన్న దానికి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా మందు బ్లాక్ మార్కెట్ దందా గుట్టురట్టు
Balaraju Goud
|

Updated on: Jul 14, 2020 | 9:01 PM

Share

ప్రజల ప్రాణాలతో కరోనా చెలగాటమాడుతుంటే, ఇదే అదునుగా భావించిన కొందరు వారి ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు. మందు లేక ఇబ్బందులుపడుతున్న వారికి ఉపశమనంగా ఉన్న దానికి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్లాక్ మార్కెట్ దందా నిర్వ‌హిస్తున్న అంత‌రాష్ట్ర ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకట సుబ్ర‌హ్మ‌ణ్యం తో పాటు మ‌రికొంత‌మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.35.5ల‌క్ష‌ల విలువ చేసే మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుండి కోవిఫీర్, 51 ఇంజక్షన్లు, అస్తి మ్రా 9 ఇంజక్షన్లు, అక్తిమ్రా 4 ఇంజక్షన్లు, ఫిబి ఫ్లూ 180 ఎంజి క‌రోనా ర్యాపిడ్ కిట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పాతబస్తీకి చెందిన మెడికల్ వ్యాపారి వెంకట సుబ్రహ్మణ్యం మార్కెట్ లోకి వచ్చిన ఓ మందును బ్లాక్ చేశాడు. అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. సేల్స్ రిప్ర‌జంటేటర్ల ద్వారా భారీ ఎత్తున అమ్మ‌కాలు జరుపుతున్నాడు. వారితో రూ.15,000 కమీషన్ ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉప‌యోగించే 10వేల విలువ‌గ‌ల‌ మెడిసిన్ ను బ్లాక్ మార్కెట్ లో 40వేల నుంచి 50వేల వ‌ర‌కు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందాపై స‌మాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో 35.5ల‌క్ష‌ల మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి హెటిరో కంపెనీలో త‌యారు చేస్తున్న ఈ మెడిసిన్ ను.. మార్కెట్ లో షార్టేజీ ఉందంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టామన్నారు

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు