జగన్‌ సర్కార్‌కు మండలి ఛైర్మెన్ షాక్

మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలోను నెగ్గించుకోవాలనుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు కౌన్సిల్ ఛైర్మెన్ ఎం.ఏ. షరీఫ్ షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కోరిన విధంగా ఛైర్మెన్ వ్యవహరించడంతో అధికార వైసీపీ మంత్రులు, సభ్యులు ఖంగుతిన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు.. మండలిలో బిల్లును అడ్డుకునేందుకు రూల్ 71 కింద చర్చకు నోటీసు ఇచ్చారు. దాన్ని అధికార పార్టీతోను, శాసనసభా వ్యవహారాల మంత్రితో ఏ మాత్రం సంప్రదించకుండా ఛైర్మెన్ షరీఫ్ ఆమోదించారు. మూడు రాజధానుల బిల్లుకు […]

జగన్‌ సర్కార్‌కు మండలి ఛైర్మెన్ షాక్
Follow us

|

Updated on: Jan 21, 2020 | 12:56 PM

మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలోను నెగ్గించుకోవాలనుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు కౌన్సిల్ ఛైర్మెన్ ఎం.ఏ. షరీఫ్ షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కోరిన విధంగా ఛైర్మెన్ వ్యవహరించడంతో అధికార వైసీపీ మంత్రులు, సభ్యులు ఖంగుతిన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు.. మండలిలో బిల్లును అడ్డుకునేందుకు రూల్ 71 కింద చర్చకు నోటీసు ఇచ్చారు. దాన్ని అధికార పార్టీతోను, శాసనసభా వ్యవహారాల మంత్రితో ఏ మాత్రం సంప్రదించకుండా ఛైర్మెన్ షరీఫ్ ఆమోదించారు.

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు రూల్ 71 కింద ఇచ్చిన ప్రత్యేక చర్చ నోటీసును టేకప్ చేస్తున్నట్లు ఛైర్మెన్ రూలింగ్ ఇచ్చారు. దాంతోపాటు దీనిపై చర్చకు రెండు గంటల సమయం కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దాంతో ఛైర్మెన్ తీరుపై వైసీపీ సభ్యులు, మంత్రులు మండిపడ్డారు. టీ బ్రేక్‌లో ఛైర్మెన్ ఛాంబర్‌లోకి వెళ్ళి ఆయనతో మంతనాలు చేశారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లుపై ముందుగా చర్చ చేపట్టాలని సూచించారు. 71వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును టేకప్ చేసేందుకు వారం రోజుల గడువు వుంటుందని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు ముందు ప్రాధాన్యత నివ్వాల్సి వుంటుందని మంత్రులు ఛైర్మెన్‌కు తెలిపారు. అయితే మంత్రుల అభిప్రాయంతో విభేదించిన మండలి ఛైర్మెన్ షరీఫ్ 71వ నిబంధన కింద టీడీపీ ఇచ్చిన నోటీసుపైనే ముందుగా చర్చ చేపడతానని తెగేసి చెప్పినట్లు సమాచారం. తన రూలింగ్‌ను వెనక్కి తీసుకునేందుకు షరీఫ్ ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై మంత్రులు ఫోకస్ చేసినట్లు సమాచారం.

అయితే, నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు సెక్షన్ 71 కింద మండలికి ఉందని, టీడీపీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడానికి ఈ నిబంధనను విపక్ష టీడీపీ వినియోగించుకుంటుందని వెల్లడించారాయన. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లుల్లోని సారాంశాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయనన్నారు. బయట జరుగుతోన్న ప్రజాందోళనలకు మద్దతుగానే తామీ నిర్ణయాన్ని తీసుకున్నామని యనమల చెప్పారు.