కరోనా కల్లోలం..భారత్ హై అలర్ట్

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. హుబేలో ఒక్కరోజే 64మంది మృతి చెందారు. వీరితో కరోనా మృతుల సంఖ్య 425కు చేరింది. మరో 25వేల మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. ఇటు భారత్‌ కూడా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేసింది. […]

కరోనా కల్లోలం..భారత్ హై అలర్ట్

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. హుబేలో ఒక్కరోజే 64మంది మృతి చెందారు. వీరితో కరోనా మృతుల సంఖ్య 425కు చేరింది. మరో 25వేల మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి.

ఇటు భారత్‌ కూడా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేసింది. కరోనా ఎఫెక్టెడ్‌ కంట్రీస్‌ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చేరిన 29 మందిలో నలుగురి శాంపిల్స్‌ను NIVకి పంపారు. కరోనా బాధితుల కోసం 820 పడకలు సిద్ధం చేసింది యూపీ సర్కార్‌.

కరోనా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన 63మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వారిలో 56 శాంపిల్స్‌ను పరీక్షలకు పంపగా..39 నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపింది స్థానిక ప్రభుత్వం. ఇక తమ రాష్ట్రంలో మూడు కేసులు నమోదవడంతో హై అలర్ట్‌ ప్రకటించింది కేరళ సర్కార్‌.

Click on your DTH Provider to Add TV9 Telugu