AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన్‌ధన్ ఖాతాల్లో నేరుగా రూ.7500..!

లాక్‌డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్‌ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ,..

జన్‌ధన్ ఖాతాల్లో నేరుగా రూ.7500..!
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2020 | 9:39 AM

Share
కోవిడ్‌-19:  ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాల‌తో పాటు భార‌త్‌లోనూ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో  కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. ఉపాధి లేక ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్‌ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ, ప్రధాని కిసాన్ పథకం ద్వారా వారికి రూ.7500 అందించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ 19పై మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో ఏర్పడిన పార్టీ సంప్రదింపుల బృందం కేంద్ర ప్రభుత్వానికి తాము చేసిన సూచనలు తెలియజేస్తామ‌న్నారు.
క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్యానెల్ సోమవారం నాడు మొదటిసారి సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో భేటీ అయిన ఈ ప్యానెల్ ప్రస్తుతం దేశం ముందున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇలు) రంగం పునరుద్ధరణ, పండిన పంటల సేకరణ, వలసదారుల సమస్యలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించింది. చిన్న పరిశ్రమల పై తాము ఒక పటిష్టమైన పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించామ‌ని కాంగ్రెస్ సీనియర్ నేత‌ జైరాం రమేష్ చెప్పారు.  దీనిపై ఒకటి, రెండు రోజుల్లో వివరణాత్మకమైన ప్రణాళికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్ల‌డించారు. కష్టాల్లో ఉన్న ఈ రంగాల వారికి దయగల, బాధ్యతాయుతమైన ప్రభుత్వం నిధులు సమకూర్చగలదని ఆశిస్తున్నామ‌న్నారు.