ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు కౌంటర్ ట్వీట్
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ట్వీట్ చేశారు. టీడీపీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని మోడీ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందిస్తూ.. అవును రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికారమార్పు కోరుకుంటున్నారని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. హోదాతో రాష్ట్రాన్ని ఆదుకుంటామన్న హామీలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి కౌంటరిచ్చారు. ఏపీ రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి.. మట్టి, నీరు ముఖాన కొట్టారని, అలాంటి వారికి మాట్లాడటానికి సిగ్గు […]
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ట్వీట్ చేశారు. టీడీపీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని మోడీ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందిస్తూ.. అవును రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికారమార్పు కోరుకుంటున్నారని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. హోదాతో రాష్ట్రాన్ని ఆదుకుంటామన్న హామీలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి కౌంటరిచ్చారు. ఏపీ రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి.. మట్టి, నీరు ముఖాన కొట్టారని, అలాంటి వారికి మాట్లాడటానికి సిగ్గు వేయడం లేదా?అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి @narendramodi గారు? పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!?
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 1, 2019