ఐటీ గ్రిడ్ కేసులపై చంద్రబాబు కన్నెర్ర

మదనపల్లె: ఐటీ గ్రిడ్ కేసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉండే పోలీసులు కాపాడటమేంటని ప్రశ్నించారు. మన ఆస్తిని దొంగిలిస్తే మనం బాధపడకుండా తెలంగాణలో ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం చూపిస్తుండట అని విమర్శించారు. మనల్ని దెబ్బతీయడానికి, మన పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటాను ఉందంటున్నారు. అది ఉంటే […]

ఐటీ గ్రిడ్ కేసులపై చంద్రబాబు కన్నెర్ర
Vijay K

|

Mar 04, 2019 | 3:39 PM

మదనపల్లె: ఐటీ గ్రిడ్ కేసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉండే పోలీసులు కాపాడటమేంటని ప్రశ్నించారు. మన ఆస్తిని దొంగిలిస్తే మనం బాధపడకుండా తెలంగాణలో ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం చూపిస్తుండట అని విమర్శించారు. మనల్ని దెబ్బతీయడానికి, మన పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటాను ఉందంటున్నారు. అది ఉంటే మాకు పంపించండి దాని సంగతి మేము చూసుకుంటాం అని చంద్రబాబు అన్నారు. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పని చేస్తున్నాడని ఇక్కడ కంపెనీలను మీరు అరెస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా.. అన్నారు చంద్రబాబు. కేసీఆర్‌తో కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలనుకుంటే కబడ్దార్ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిప్పిలి దగ్గర హంద్రీనీవాకు ఆయన జలహారతి ఇచ్చారు. రూ.4,412 కోట్లతో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే చంద్రబాబు ఐటీ గ్రిడ్ కేసులపై చంద్రబాబు స్పందించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu