మీరు దద్దమ్మ పాత్ర పోషిస్తారా మరి.. టీడీపీపై జీవీఎల్ సెటైర్..

ఏపీ రాజధాని మార్పు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. శాసనసభలో రాజధాని మార్పు బిల్లును జగన్ సర్కార్ ఆమోదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ అయిన బీజేపీ.. అటు జగన్ సర్కార్‌పై.. ఇటు చంద్రబాబుపై ఫైర్ అవుతోంది. ఏపీలో ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకునే […]

మీరు దద్దమ్మ పాత్ర పోషిస్తారా మరి.. టీడీపీపై జీవీఎల్ సెటైర్..
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 21, 2020 | 3:52 PM

ఏపీ రాజధాని మార్పు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. శాసనసభలో రాజధాని మార్పు బిల్లును జగన్ సర్కార్ ఆమోదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ అయిన బీజేపీ.. అటు జగన్ సర్కార్‌పై.. ఇటు చంద్రబాబుపై ఫైర్ అవుతోంది. ఏపీలో ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్రంపైన రుద్దొద్దన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. టీడీపీ శ్రేణులు అడుగుతున్నారని, తాము ఆ పాత్ర పోషిస్తే, టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జీవీఎల్‌ కోరారు.