బాల‌య్య‌తో ఢీకొట్ట‌బోతున్న భూమిక‌..!

బాల‌య్య‌తో ఢీకొట్ట‌బోతున్న భూమిక‌..!

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్​లో గ‌తంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి..హ్యాట్రిక్ న‌మోదు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఇంట్ర‌స్టింగ్ అబ్డేట్ అందుతోంది. మూవీలో కీల‌క‌మైన లేడీ విల‌న్ పాత్ర కోసం భూమికను బోయ‌పాటి అప్రోచ్ అయ్యార‌ని తెలుస్తోంది. బాల‌య్య‌ – బోయపాటి అంటే ముందుగా గుర్తొచ్చేవి యాక్ష‌న్ సీన్లు, ఊపు తీసుకొచ్చే డైలాగ్​లు, భయపెట్టే విలన్లు. కానీ ఈ […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 4:09 PM

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్​లో గ‌తంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి..హ్యాట్రిక్ న‌మోదు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఇంట్ర‌స్టింగ్ అబ్డేట్ అందుతోంది. మూవీలో కీల‌క‌మైన లేడీ విల‌న్ పాత్ర కోసం భూమికను బోయ‌పాటి అప్రోచ్ అయ్యార‌ని తెలుస్తోంది.

బాల‌య్య‌ – బోయపాటి అంటే ముందుగా గుర్తొచ్చేవి యాక్ష‌న్ సీన్లు, ఊపు తీసుకొచ్చే డైలాగ్​లు, భయపెట్టే విలన్లు. కానీ ఈ సారి లేడీ విల‌న్ తో బోయ‌పాటి మూవీని కొత్త‌గా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది. గతంలో బాలయ్య స‌ర‌స‌న‌ ‘రూలర్‌’లోనూ కీలక పాత్రలో క‌నిపించింది భూమిక. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తుడటం, అదీ భూమిక‌ది లేడీ విల‌న్ పాత్ర కావడం వల్ల అందరిలో ఆసక్తి నెలకొంది. ఫ‌స్ట్ షెడ్యూల్​ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు, ప్ర‌స్తుతం కరోనా రూపంలో అవాంతరం ఎదురైంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu