AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. శనివారం సాయంత్రంలోగా కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Breaking లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 5:07 PM

Share

దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. శనివారం సాయంత్రంలోగా కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కరోనాను కట్టడం చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే ఖచ్చితమైన మార్గమని పలువురు చేసిన సూచనలను ప్రధాని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలస్తోంది.

శనివారం ఉదయం రెండు గంటల పాటు దేశంలోని ముఖ్యమంత్రులందరితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఎక్కువ మంది లాక్ డౌన్ ని పొడిగించాలని మోదీని కోరారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం కొంత వెసులుబాటును కోరాయి. ముఖ్యమంత్రుల అభిప్రాయాలతోపాటు ఇదివరకే మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధాన మంత్రులు, పలువురు విపక్ష నేతలతోపాటు మిత్రపక్షాల నేతలతో ప్రధాని మాట్లాడారు. లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు ముఖ్యమంత్రులు. సీఎంలతోపాటు లాక్ డౌన్ పొడిగించాలంటున్నారు వైద్య రంగ నిఫుణులు. దాంతో రెండు వారాలపాటు కొనసాగించేందుకు కేంద్రం రెడీ అవుతోంది.

వీరందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మోదీ.. మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వ్యవసాయోత్పత్తులతోపాటు ఫిషరీస్, ఆక్వా, పౌల్ట్రీ విక్రయాలకు వీలు కల్పిస్తూ కొన్ని మార్గదర్శకాలను మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన రానుంది. మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రస్తుత లాక్ డౌన్ పీరియడ్ ముగిసేలోగా ప్రసంగించనున్నట్లు సమాచారం.