అసదుద్దీన్‌కు కిషన్ రెడ్డి చురక… అలా అంటే చనిపొమ్మనే కదా?

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లపై చురకలంటించారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కరోనాతో మరణించిన వారంతా అమరులు అంటూ అసదుద్దీన్ చేసి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఉదహరించారు. అమర వీరులు కమ్మని చెబుతున్నారంటే కరోనా వచ్చిన వారంతా మరణించాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి… దేశంలో ప్రస్తుం పెరుగుతున్న కరోనా కేసులన్నీ మర్కజ్ వల్ల ఉత్పన్నమైనవేనని చెప్పారు. మర్కజ్ కారణంగానే దేశంలో […]

అసదుద్దీన్‌కు కిషన్ రెడ్డి చురక... అలా అంటే చనిపొమ్మనే కదా?
Follow us

|

Updated on: Apr 11, 2020 | 3:20 PM

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లపై చురకలంటించారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కరోనాతో మరణించిన వారంతా అమరులు అంటూ అసదుద్దీన్ చేసి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఉదహరించారు. అమర వీరులు కమ్మని చెబుతున్నారంటే కరోనా వచ్చిన వారంతా మరణించాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి… దేశంలో ప్రస్తుం పెరుగుతున్న కరోనా కేసులన్నీ మర్కజ్ వల్ల ఉత్పన్నమైనవేనని చెప్పారు.

మర్కజ్ కారణంగానే దేశంలో 80 శాతం కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయని, వారిలో చాలామందిని క్వారంటైన్ చేశామని, మరి కొందరు తప్పించుకు తిరుగుతున్నారని, వారి ఆచూకీ చెబితే బహుమతులు అంటూ కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కరోనాను మతం కోణంలో చూడొద్దు.. వాళ్లను అవమానించవద్దు..’’ అని కిషన్ రెడ్డి అంటున్నారు. అసద్ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, కరోనాతో చనిపోయినవాళ్లు అమర వీరులు, అల్లా దగ్గరకు వెళ్లినవారు అంటూ చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటి? అని .. అంటే అందరినీ చనిపోమని చెప్పడమేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

దేశంలో కరోనా 2వ స్టేజిలో మాత్రమే ఉందని, విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్థానికుల వరకే వ్యాప్తి చెందిందని ఆయన తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వరకు మాత్రమే కరోనా విస్తృతి ఉందని, ఒక ఇంట్లో ఒక వ్యక్తి వల్ల 50 కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందని వివరించారు కిషన్ రెడ్డి. ముంబై ధారవిని రెడ్ జోన్‌గా ప్రకటించి పూర్తిగా సీల్ చేశారని తెలిపారు.

కరోనా విచిత్రమైనదని, మందు లేదని కొందరిలో 14 రోజుల్లో బయటపడుతుందని, కొందరిలో 28 రోజులకు బయటపడుతుందని ఆయన చెబుతున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా, జీవన విధానాల కారణంగా 28, 30 రోజులకు బయటపడ్డ దాఖలాలున్నాయని, కొందరికైతే చనిపోయేవరకు తెలీలేదని చెబుతున్నారు కిషన్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి 5-6 వారాలు పట్టొచ్చు లేదా 5-6 నెలలు కూడా పట్టొచ్చన్న చర్చ జరుగుతోందంటున్నారాయన.