దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా. యూపీ ముఖ్యమంత్రులు ఈ మేరకు అభ్యర్థించారు. శనివారం మోదీ లాక్ డౌన్ అంశంపై వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. తాను ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని, కరోనా కట్టడి, లాక్ డౌన్ అంశాలపై తనతో వారు చర్చించవచ్చునని ఆయన అన్నారు. బీహార్ కూడా తాము లాక్ డౌన్ పొడిగింపునకు సుముఖమేనని, అయితే వ్యవసాయ రంగానికి దీన్ని మినహాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత ఢిల్లీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా-చేతితో తయారు చేసిన ఫేస్ మాస్క్ ధరించి మోదీ మొదటిసారిగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.