నివాస యోగ్య న‌గ‌రాల్లో బెంగళూరు టాప్.. పది లక్షల లోపు నగరాల్లో కాకినాడకు స్థానం

దేశంలో నివాస యోగ్య న‌గ‌రాల్లో మ‌న పొరుగునే ఉన్న బెంగ‌ళూరుకు అగ్రస్థానం ద‌క్కింది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

నివాస యోగ్య న‌గ‌రాల్లో బెంగళూరు టాప్.. పది లక్షల లోపు నగరాల్లో కాకినాడకు స్థానం
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 04, 2021 | 10:03 PM

Most livable ease of living cities : దేశంలో నివాస యోగ్య న‌గ‌రాల్లో మ‌న పొరుగునే ఉన్న బెంగ‌ళూరుకు అగ్రస్థానం ద‌క్కింది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 111 నగరాలతో జాబితా రూపొందించింది కేంద్ర గృహ పట్టణ వ్యవహరాల మంత్రిత్వ శాఖ. ఇందులో బెంగళూరు టాప్ ర్యాంక్ ద‌క్కించుకుని ద‌క్షిణాదికి పేరు తెచ్చింది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్‌, చెన్నై, సూరత్‌, నవీముంబయి, కోయంబత్తూర్‌, వడోదర, ఇండోర్‌, గ్రేటర్‌ ముంబయి టాప్‌ 10లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప‌ది ల‌క్షల లోపు జ‌నాభా క‌లిగిన 62 న‌గ‌రాల్లో సిమ్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడు చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. అందులోనూ టాప్ టెన్ న‌గ‌రాల్లో కాకినాడ ఉండ‌డాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈజ్ ఆఫ్ లివింగ్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ లాస్టియర్‌ ఇండెక్స్‌లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 10 లక్షల జనాభా పైబడిన నగరాలు, 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలుగా వర్గీకరించి ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. మొత్తం 111 నగరాలను ర్యాంకింగ్స్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో టాప్‌ పొజిషన్‌లో నిలిచింది కర్ణాటక రాజధాని బెంగళూరు. 10లక్షల జనాభాకు పైబడిన నగరాల్లో బెంగుళూరు తర్వాతి స్థానంలో పుణె, అహ్మదాబాద్ టాప్‌ త్రీ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సిటీస్‌లో చోటు దక్కించుకున్నాయి, చెన్నై, సూరత్ నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో 13వ స్థానంలో నిలిచింది. ఏపీకి కాబోయే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వైజాగ్‌ ఈ ఇండెక్స్‌లో 15వ స్థానం దక్కించుకుంది. ఇక తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ మహానగరానికి 24వ స్థానం దక్కితే… 41వ స్థానంలో ఉంది విజయవాడ సిటీ.

10లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో.. సిమ్లా ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో నెంబర్‌ వన్‌గా ఉంది. ఈ కేటగిరీలో ఒడిశా రాజధాని భువనేశ్వర్, దాద్రానగర్‌హవేలిలోని సిల్వస్సా తర్వాతి స్థానాలతో టాప్‌ త్రీలో నిలిచాయి. తెలుగురాష్ట్రాల్లోని నాలుగు నగరాలు ఈ ఇండెక్స్‌లో ప్లేస్‌ సంపాదించాయి. పోర్ట్‌ సిటీ కాకినాడ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో ఫోర్త్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. 19వ స్థానంలో వరంగల్, 22వ ప్లేస్‌లో కరీంనగర్, 46వ ర్యాంక్‌లో తిరుపతి..10లక్షలలోపు జనాభా ఉన్న ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సిటీల్లో చోటు సంపాదించాయి.

ఇక, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్‌లో 10లక్షలపైన జనాభా కలిగిన నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సిటీ టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌ రాజధాని నిలిచాయి. మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌ ర్యాంకింగ్స్‌లో వైజాగ్‌ నైన్త్‌ ప్లేస్‌ దక్కించుకుంటే..17వ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఇక మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌ ర్యాంకింగ్‌లో 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో..విజయవాడ 27వ ర్యాంక్‌ సాధించింది. మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్‌లో 10లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల్లో ఢిల్లీ పరిధిలోని ల్యుటెన్స్‌ టాప్‌లో ఉంటే…టెంపుల్‌ సిటీ తిరుపతి సెకండ్‌ప్లేస్‌ దక్కించుకుంది. గుజరాత్‌ గాంధీనగర్‌ 3వస్థానం సాధించింది. పోర్ట్‌ సిటీ కాకినాడ మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌లోనూ 11వ ర్యాంక్‌తో ప్రత్యేకత చాటుకుంది. వరంగల్‌18వ స్థానం, కరీంనగర్‌ 21వ ర్యాంక్‌తో మున్సిపల్‌ పెర్ఫారెన్స్‌ ఇండెక్స్‌లోనూ తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నాయి.

ఇదీ చదవండిః  Hyderabad: హైదరాబాదీయులకు కరోనా భయం పోయినట్లేనా.. సగం మందిలో యాంటీబాడీలు.. సర్వేలో తేలిన వివరాలు..