ఆ ఐదుగురు ఆటగాళ్లకు నాడా నోటీసులు… వివరణ ఇచ్చిన బీసీసీఐ

ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో సమాచారం అందించక పోవటం వల్లే వీరికి నోటీసులు జారీ చేసింది. "ఎప్పుడు ఎక్కడ" అనే నిబంధలను పాటించటంలో విఫలం అయ్యారని పేర్కొంది.

  • Sanjay Kasula
  • Publish Date - 6:05 am, Sun, 14 June 20
ఆ ఐదుగురు ఆటగాళ్లకు నాడా నోటీసులు... వివరణ ఇచ్చిన బీసీసీఐ

ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు ఇచ్చింది. వారిలో కెఎల్ రాహుల్, రవీంద్ర జాడేజా, చె తేశ్వర్ పుజారా ఉన్నారు. లాక్ డౌన్ సమయం లో సమాచారం అందించక పోవటం వల్లే వీరికి నోటీసులు ఇచ్చింది. “ఎప్పుడు ఎక్కడ” అనే నిబంధలను పాటించటంలో విఫలం అయ్యారని పేర్కొంది. వీరితోపాటు ఇద్దరు మహిళా క్రికెటర్లు కూడా నోటీసులు అందుకున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో బీసీసీఐ నుంచి తమకు వివరణ వచ్చిందని నాడా డీజీ నవీన్‌ అగర్వాల్‌ తెలిపారు. పాస్‌వర్డ్ సమస్య వల్లే “ఎప్పుడు ఎక్కడ” అనే వివరాలను అందించక లేక పోయారాని… ఆ వివరాలను బీసీసీఐ తమకు తెలిపిందని అన్నారు. ఎక్కడ ఉన్నామనే సమాచారం ఇవ్వకుంటే డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘన కిందకి వస్తుంది. అలాంటివారిపై గరిష్టంగా రెండేళ్ల సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉంటుంది. అయితే పాస్‌వర్డ్‌తో సమస్య ఉంటే.. స్వయంగా వారినే తమ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆ ఐదుగురిని కోరితే సరిపోయేదని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు. ఈ సమస్య వచ్చేది కాదని కామెంట్ చేశారు.