రామ మందిరం భూమిపూజకు లడ్డూలు సిద్ధం

అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ వేడుకను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారు చేస్తున్నారు. పూజా కార్యక్రమానికి వచ్చే అతిథులకు అందజేసేందుకు లడ్డూలను సిద్ధం చేస్తున్నారు.

ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీరాముల వారికి ఈ లడ్డూలను నైవేథ్యంగా సమర్పించనున్నారు. ఆ తరువాత, పునాది వేసే కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ ఈ లడ్డూలను పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు హన్స్ బాబా సంస్థాన్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, మన దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా ఈ లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య, రామ మందిరం చరిత్రను తెలియజేసే మూడు పుస్తకాలతో పాటు లడ్డూల బాక్స్, శాలువ వంటి వాటితో కూడిన ఒక బ్యాగ్ ను అతిధులకు బహుమతిగా అందజేయనున్నట్లు మణి రామ్ దాస్ చావ్ని ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

గత 4 రోజులుగా లడ్డూల తయారీ పనులు జరుగుతున్నాయని, మెగా ఈవెంట్‌కు ముందే అవి ప్యాక్ చేసి సిద్ధం చేస్తున్నామని చావ్ని సిబ్బంది తెలిపారు. రామ మందిరం నిర్మాణం భూమి పూజ వేడుకకి దేశ, విదేశాల నుంచి అతిథులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే ప్రస్తుతం రామాలయం నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu