అసెంబ్లీలో తన ప్రేమ కథ చెప్పిన బాల్క సుమన్

అసెంబ్లీలో తన ప్రేమ కథ చెప్పిన బాల్క సుమన్

హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. అయితే చివరి రోజున డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన పద్మారావు గౌడ్‌కు పలువురు శాభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సదర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తిర విషయాలను ప్రస్తావించారు. తన ప్రేమ పెళ్లి గురించి చెప్పారు. ఆయన ప్రేమ పెళ్లికి, పద్మారావు గౌడ్‌కు సంబంధం ఉడటం వల్ల బాల్క సుమన్ ఆ ప్రస్తావన తెచ్చారు. 2012లో తనకు పిల్లనిచ్చేందుకు అత్త, మామలు ఒప్పుకోలేదు. అప్పుడు మీ […]

Vijay K

|

Feb 25, 2019 | 3:14 PM

హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. అయితే చివరి రోజున డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన పద్మారావు గౌడ్‌కు పలువురు శాభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సదర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తిర విషయాలను ప్రస్తావించారు. తన ప్రేమ పెళ్లి గురించి చెప్పారు. ఆయన ప్రేమ పెళ్లికి, పద్మారావు గౌడ్‌కు సంబంధం ఉడటం వల్ల బాల్క సుమన్ ఆ ప్రస్తావన తెచ్చారు.

2012లో తనకు పిల్లనిచ్చేందుకు అత్త, మామలు ఒప్పుకోలేదు. అప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంలో మీరు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్‌లు కీలక పాత్ర పోషించారు. బాల్క సుమన్ తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు, కేసీఆర్‌కు దగ్గరవుతాడు అని అత్త, మామలకు వివరించారు.

తర్వాత నా పెళ్లి కూడా మీరే దగ్గరుండి జరిపించారంటూ పద్మారావు గౌడ్‌కు బాల్క సుమన్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా తన లవ్ మ్యారేజ్ గురించి బాల్క సుమన్ చెప్పడంతో సభ మొత్తం ఆహ్లాదకరంగా మారింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu