బాలనేరస్తులపై హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

అనాధ బాలురు, బాలికలు నేరాలకు ఎందుకు పాలపడ్తున్నారో మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మీ చెప్పారు. ఈ దిశగా పోలీసులు తక్షణమే విచారణ చేయాలని కోరారు. జ్యువినెల్ జస్టిస్ అమలులో ఉన్నప్పటికీ కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అనాధ పిల్లలకు ఇంటి వాతావరణం కల్పించాలని చెప్పిన ఆమె, అనాధ పిల్లలును జేజే ఆక్ట్ ప్రకారం వీలైనంత త్వరగా వాళ్ల తల్లిదండ్రులు చెంతకు చేర్చాలన్నారు. జేజే యాక్ట్ ప్రకారం చైల్డ్ […]

బాలనేరస్తులపై హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
Venkata Narayana

|

Oct 01, 2020 | 11:55 AM

అనాధ బాలురు, బాలికలు నేరాలకు ఎందుకు పాలపడ్తున్నారో మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మీ చెప్పారు. ఈ దిశగా పోలీసులు తక్షణమే విచారణ చేయాలని కోరారు. జ్యువినెల్ జస్టిస్ అమలులో ఉన్నప్పటికీ కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అనాధ పిల్లలకు ఇంటి వాతావరణం కల్పించాలని చెప్పిన ఆమె, అనాధ పిల్లలును జేజే ఆక్ట్ ప్రకారం వీలైనంత త్వరగా వాళ్ల తల్లిదండ్రులు చెంతకు చేర్చాలన్నారు. జేజే యాక్ట్ ప్రకారం చైల్డ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్షన్ 83 ప్రకారం అనాధ పిల్లల హోమ్స్ పై ప్రతీ నెలకొకసారి పోలీస్‌ల పర్యవేక్షణ కచ్చితంగా ఉండలని న్యాయమూర్తి అన్నారు. సెక్షన్ 39 ప్రకారం సిబ్బిలింగ్స్ ను ఒకే హోమ్ లో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని.. చైల్డ్ హోమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆమె సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అనాధ పిల్లల పై బాధ్యత ఉందన్న న్యాయమూర్తి.. బాల నేరస్థుల వ్యవహార సైలిలో మార్పు వచ్చే విధంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు. మరోసారి హైకోర్ట్ జేజే కమిటి గా ఉండే రోజు రాకూడదని ఆమె అన్నారు.

కాగా, ఈ విషయమై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కు ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు చెప్పారు. జ్యువినల్ జస్టిస్ ద్వారా అనాధ బాలబాలికలు నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. సమాజంలో అనాధ బాలురు, బాలికలు త్వరగా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అనాధ బాలురు, బాలికలను గుర్తించి వారిని నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలని డిజిపి..ఎపి పోలీస్ లను ఆదేశించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu