కఠిన నిబంధనలతో కరోనా కట్టడి చేశాంః ఉత్తర కొరియా

కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఎట్టకేలకు ఉత్తర కొరియా స్పందించింది. ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకుంటున్న ఉత్తర కొరియా అంతర్జాతీయ వేదికగా అసలు విషయం చెప్పింది.

కఠిన నిబంధనలతో కరోనా కట్టడి చేశాంః ఉత్తర కొరియా
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 01, 2020 | 11:15 AM

కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఎట్టకేలకు ఉత్తర కొరియా స్పందించింది. ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకుంటున్న ఉత్తర కొరియా అంతర్జాతీయ వేదికగా అసలు విషయం చెప్పింది. వైరస్ కట్టడికి కిమ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఐక్యరాజ్యసమితి వేదిక వెల్లడించింది. తమ దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయంటూ ఉత్తర కొరియాకు చెందిన అమెరికా రాయబారి కిమ్‌ సోంగ్‌ తెలిపారు. బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన కరోనా నియంత్రణ చర్యలను వెల్లడించారు. కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలను, సూచనలను కిమ్‌ సోంగ్‌ లైవ్‌ ద్వారా వివరించారు. కరోనా మహమ్మారి కాలంలో విదేశీయులెవరినీ తమ దేశంలోకి రానివ్వకుండా కట్టడి చేయగలిగామన్నారు. ప్రతిఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా కఠినమైన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

కొవిడ్ నిబంధనలు పాటించకపోతే సహించబోయేది లేదని కిమ్‌ ప్రభుత్వం చెప్పిందని అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ పాలక పార్టీ సభ్యులతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. అందులో ప్రధానంగా యాంటీ వైరస్‌ క్యాంపెయిన్‌పై చర్చించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదని ఆ దేశం చెబుతుండగా, విదేశీ నిపుణులు దాన్ని కొట్టిపారేస్తున్నారు.