ట్రంప్ ఆశలపై ‘నీళ్లు చల్లిన’ మోడెర్నా కరోనా వైరస్ వ్యాక్సీన్ !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై 'మోడెర్నా' కంపెనీ.. కరోనా వైరస్ వ్యాక్సిన్ 'నీళ్లు చల్లింది'. ( ఈ సంస్థ పెద్దఎత్తున వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై ‘మోడెర్నా’ కంపెనీ.. కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘నీళ్లు చల్లింది’. ( ఈ సంస్థ పెద్దఎత్తున వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే). అంటే నవంబరు 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికకు ముందే ఈ వ్యాక్సీన్ వచ్ఛే అవకాశం లేదని తేలిపోయింది. ఈ సంస్థ సీఈఓ స్టెఫానే బాన్సెల్ ఈ ‘చల్లని కబురు’ ను మీడియాకు తెలియజేశారు. ఈ కరోనా రోజుల్లో ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ కు ముందే ఈ వ్యాక్సీన్ ని జనంలోకి తెఛ్చి ఈ ఘనత నాదేనని చాటుకోవాలన్న ట్రంప్ ఆశ అడియాసే అయింది. కనీసం నవంబరు 25 కు ముందే దీన్ని అత్యవసర వినియోగానికి తేవాలనుకున్నామని, కానీ, తమకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆలోగా ఆమోదం లభిస్తుందా అన్నది అనుమానమేనని స్టెఫానే చెప్పారు. నిజానికి ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సీన్.. తుది దశ ట్రయల్స్ లో ఉన్న11 వ్యాక్సిన్లలో ఒకటి.
ఇప్పటికే మోడెర్నా వ్యాక్సీన్ కోసం ముఖ్యంగా అమెరికాలో లక్షలాది రోగులు ఎదురు చూస్తున్నారు. ఇక ‘ఫైజర్’ సంస్థ వ్యాక్సీన్ ది కూడా ‘ఇదే దారి’! ట్రంప్ యోగం ఈ వ్యాక్సిన్ల మీదే ఆధారపడి ఉన్న విషయం గమనార్హం.